జనసేన అవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి..!

జనసేన ఆవిర్భావ సభకు చిత్రాడలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగసభ జరగనున్నది.
మొత్తం 90 నిమిషాల పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం చేయనున్నారు.. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది..
రాజకీయ పార్టీగా జనసేన 12 ఏళ్ల ప్రస్థానం,సాధించిన విజయాలతో డాక్యుమెంటరీ తయారు చేశారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు..
