జనసైనికులకు జనసేనాని షాక్..?
జనసైనికులకు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. నిండు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా సమూలంగా మార్పులు వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులెడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో తప్పిపోయిన ఆడబిడ్డలందర్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్షేమంగా తమ ఇండ్లకు చేర్చింది.
హ్యాట్సాప్ ఏపీ పోలీసు.. హోం మంత్రి అనిత గారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇదే విజన్ తో మీరు పని చేయండి. మీ అడుగుల్లో అడుగై మీ వెంట ఉంటాము.. మీరు ఈ ఐదేండ్లే కాదు మరో పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. పవన్ చేసిన తాజా వ్యాఖ్యలతో జనసైనికులు నిరాశలో కూరుకుపోయారు.
తమ నాయకుడు సీఎం అవ్వాలని వారు కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయా..?. గత పదేండ్లుగా ఎన్నో కలలు కన్నాము.. ప్రతి సభలో.. ప్రతి సమావేశంలో సీఎం సీఎం సీఎం అని నినదించిన నినాదాలన్నీ నినాదాలగానే ఉండిపోతాయా అని వారు తెగ మనోవేదనకు గురవుతున్నారు. చూడాలి మున్ముందు జనసేనాని జనసైనికులకు ఇంకా ఎన్ని షాకులిస్తారో..?