జమ్ము కశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తంగా జమ్ము కశ్మీర్ లో మూడు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 19న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 25న రెండో విడతలో ఎన్నికలు జరుగుతాయి..
అక్టోబర్ ఒకటో తారీఖున మూడో విడతగా జమ్ము కశ్మీర్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలను ఈసీ వెల్లడించనున్నది. ఈ రాష్ట్రంలో మొత్తం 90అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 74స్థానాలు జనరల్ కాగా 9ఎస్టీ,7ఎస్సీలకు రిజర్వుడ్ స్థానాలుగా ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం 87లక్షల ఓటర్లు ఉన్నారు. వీరికోసం 11వేల పోలింగ్ బూతులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.ఇప్పటికే నళిన్ ప్రభాత్ అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపింది. ఈ ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయన ఆ రాష్ట్ర స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతారని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.