జమిలీ ఎన్నికలు ఖాయమా…?
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు సై అంటుందా..?. ఇప్పటికే జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుందా..?. దానికవసరమయ్యే రాజ్యాంగంలోని మూడు సవరణలను చేయడానికి మోదీ పూనుకున్నారా..? అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు.
ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లి తిరిగోచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము జమిలీ ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాము.. జమిలీ ఎన్నికల వలన ఇటు రాష్ట్రాలు.. అటు దేశం అభివృద్ధి చెందడానికి దోహాదపడుతుంది. ప్రజాసొమ్ముతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన నేతల దుబార ఖర్చులు మిగిలుతాయని పరోక్షంగా జమిలీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి.. దానికి మేము సిద్ధమే అని చంద్రబాబు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో పరోక్షంగా జమిలీ ఎన్నికలకు ఏపీ సిద్ధమని బాబు చెబుతున్నట్లు అవుతుంది.
మరోవైపు కేరళ లాంటి రాష్ట్రం తాము జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం అని అప్పుడే అసెంబ్లీ తీర్మానం చేసింది కూడా.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన తాము మాత్రం జమిలీ ఎన్నికలను నిర్వహించి తీరుతాము. దానికి అవసరమైన రాజ్యాంగ సవరణలను సైతం చేసి తీరుతాము.. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత. అనుకూలిత ప్రభుత్వాలుండటంతో రాష్ట్రాల మెజార్టీలో కూడా ఆధిక్యతను సాధించి తీరుతాము అని కేంద్ర మంత్రి ఒకరూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కూడా ఈ వార్తలకు బలం చేకూరుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 లేదా 2027లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు.