లోక్ సభలో జమిలీ ఎన్నికల బిల్లు..!
మంగళవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు. జమిలీ ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్,ఇతర పక్షాల సభ్యులు వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. రాష్ట్రాల అసెంబ్లీ కాల వ్యవధిని తగ్గించడానికి వీళ్లేదు. బీజేపీ తమ స్వార్ధ రాజకీయాల కోసం ఈ బిల్లును తీసుకోచ్చిందని ఆయన అన్నారు.
అయితే లోక్ సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు గట్టెక్కాడానికి మొత్తం సభ్యులల్లో 361మంది సభ్యులు మద్ధతు తెలపాలి. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి 291మంది సభ్యులున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూటమికి 243మంది సభ్యులున్నారు.