జీవన్ రెడ్డికి మద్ధతుగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

 జీవన్ రెడ్డికి మద్ధతుగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jaggareddy Support Jeevan Reddy

Loading

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి మద్ధతుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” జీవన్ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ లోనే గడిచింది.

నిత్యం జనాల్లో ఉండే నాలాంటి.. జీవన్ రెడ్డి లాంటివాడ్ని ఎందుకు ఓడించారో నాకు ఆర్ధం అవ్వడం లేదు.. ఈ వయసులో జీవన్ రెడ్డి మనోవేదనకు గురవ్వడం నామనసు కలిచివేసింది. జీవన్ రెడ్డి గత నలబై ఏండ్లుగా అనేక కష్టాలను అనుభవించాడు.

ఆయన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ,మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీలే తీర్చాలి.. హైకమాండ్ దృష్టికి నేను తీసుకెళ్తాను.. జీవన్ రెడ్డి లాంటి నాయకులను మనం కాపాడుకోవాలని ఆయన జీవన్ రెడ్డికి మద్ధతుగా వ్యాఖ్యానించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *