ఉప రాష్ట్రపతి రాజీనామా..!

Jagdeep Dhankhar Vice President
సింగిడి, వెబ్ న్యూస్ : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ తన పదవికీ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తాను తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
తన పదవీకాలంలో మద్ధతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేందర్ మోదీకి జగదీప్ థన్కర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా సరిగ్గా మూడేండ్ల కిందట అంటే ఆగస్టు 11, 2022లో ఆయన్ని ఉపరాష్ట్రపతిగా మోదీ సర్కారు ఎన్నుకుంది.
అంతకుముందు జగదీప్ 1990-1991 మధ్య కేంద్ర మంత్రిగా, 2019-22 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఆయన పనిచేశారు. జగదీప్ తాజా నిర్ణయంతో తర్వాతి ఉపరాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.