ఆ మంత్రిని ఆకాశానికెత్తిన చంద్రబాబు

Andhrapradesh CM
ఏపీలో విజయవాడను వరదలతో ముంచెత్తిన బుడమేరు వాగు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లూ పర్యవేక్షించి పూర్తి చేయించిన రాష్ట్ర జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు.
వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మలతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
‘గుడ్ జాబ్ రామానాయుడు’ అంటూ మంత్రిని ప్రశంసించారు. బుడమేరు గట్టు ఎత్తును పూర్తిస్థాయిలో పెంచి బలోపేతం చేయాలని సూచించారు. పులివాగు పొంగుతుండటంతో మరింత వరద వచ్చే అవకాశముందని, మరో రెండు రోజులు అలెర్ట్‌గా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
