దిల్ రాజు ఇండ్లపై ఐటీ దాడులు..!
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇండ్లపై ఈరోజు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా దిల్ రాజు కూతురు, బంధువుల ఇండ్లపై దాదాపు ఎనిమిది గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నారు.
దిల్ రాజు ఇటీవల నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెల్సిందే. మరోవైపు పుష్ప మూవీ చిత్ర నిర్మాతల ఇండ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి.
ఈ దాడుల గురించి దిల్ రాజు సతీమణీ తేజస్వీని మాట్లాడుతూ సినిమాలు నిర్మించామనే మా ఇండ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. మా బ్యాంకుల లాకర్లను తెరవమని చెప్పారు అని అన్నారు.