బాబుతో ఉత్తమ్ భేటీ – ట్విస్ట్ ఇదా..?

 బాబుతో ఉత్తమ్ భేటీ – ట్విస్ట్ ఇదా..?

N. Uttam Kumar Reddy Minister Of Telangana

తెలంగాణ రాష్ట్రంలో నిన్న గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటీపై… అతనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులు దాదాపు వందకార్లలో వెళ్లి మరి దాడులకు దిగిన సంగతి తెల్సిందే.. దీంతో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తల ధర్నాలు .. అరెస్టులతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంటే మరోపక్క ఈ రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

అయితే విజయవాడలో తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఆయన సతీమణి ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి లు పనిలో పనిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని స్వయంగా కలిశారు. దాదాపు ఓ గంటపాటు వీరు ముగ్గురు ప్రత్యేకంగా భేటీ అయ్యారని ఏపీ రాజకీయ వర్గాల టాక్. అయితే వీరి భేటీ వెనక ఉన్న ప్రధాన ట్విస్ట్ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకంగా ఉంది ఇద్దరే ముఖ్యమంత్రులు.. ఒకరు నితీష్ పవార్, మరోకరు చంద్రబాబు నాయుడు.

వీరిలో నితీష్ కుమార్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఎప్పుడోకప్పుడు కేంద్రానికి తమ మద్ధతును ఉపసంహరించుకుంటారని కూడా జాతీయ మీడియాల్లో చర్చ.. దానికి బీజం పడింది కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలోనే తేటతెల్లమైంది. ఒకవేళ నితీష్ కుమార్ ఉపసంహరించుకుంటే తప్పనిసరిగా ఇండియా కూటమి వైపే ఆయన తిరిగి వస్తారు. ఇక పోతే చంద్రబాబు నాయుడు ఉత్తమ్ కు దోస్తు అని నానుడి.

బాబును మెప్పించి ఇండియా కూటమివైపు తీసుకురావడానికి కాంగ్రెస్ ఆధిష్టానం దూతగా పంపిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. గతంలో కూడా బాబు కాంగ్రెస్ తో కలవడానికి శతధా ప్రయత్నించిన అది నెరవేరకపోయింది. తాజాగా వీరి భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటనేది కాలమే సమాధానం చెప్పాలి మరి మున్ముందు .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *