రామ్ చరణ్ – బుచ్చిబాబు ల కొత్త మూవీ టైటిల్ ఇదేనా.!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. ఉప్పన మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ శరవే గంగా జరుగుతున్న సంగతి మనకు తెల్సిందే.. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారైనట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కెర్లు కొట్టాయి నిన్న మొన్నటివరకూ.
ఇప్పుడు తాజాగా ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ జరుగుతు న్నట్టు తెలుస్తున్నది. కథ రీత్యా ఇందులో రెండు క్రీడలు కీలకంగా ఉంటాయట. ప్రధమార్ధం అంతా క్రికెట్ నేపథ్యంలో కథ సాగుతుంది. ద్వితీయా ర్ధంలో కుస్తీ కీలకం అవుతుందట. అందుకే అటు కుస్తి.. ఇటు క్రికెట్ కలిసొచ్చేలా.. ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్ని ఖరారు చేశారని సమాచారం.
దర్శ కుడు బుచ్చిబాబు దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్్ప పనిచేశారు. విజయ్ సేతుపతి లాంటి అభిరుచి గల నటుడు ఈ కథను అద్భుతం అన్నారట. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్న బుచ్చిబాబు, రెండో సినిమాతోనే టాప్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టే శారు. మైత్రీమూవీమే కర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈమూవీలో జాన్వీకపూర్ కథానాయికగా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలందిన్నాడు. కలిసి నిర్మిస్తున్నాయి.
