మహిళ హోం మంత్రిగా ఉన్న మహిళలపై ఇది పద్ధతేనా..?
వినడానికి కొద్దిగా నమ్మశక్యం లేకపోయిన ఇదే నిజం అంటున్నారు న్యూట్రల్ పీపుల్స్.. మహిళ మణులు.. వైసీపీ శ్రేణులు.. రాజకీయాల్లో వ్యక్తిగత మరి ముఖ్యంగా మహిళ నాయకులపై దూషణలు మాములే.. ఆ దూషణలు విధాన ఫరంగా ఉండాలి.. సిద్ధాంతం ఫరంగా ఉండాలి.. తప్పు లేదు కానీ క్యారెక్టర్ కించపరిచే విధంగా మహిళలను అగౌరవ పరిచే విధంగా ఉండాలి.. అది అధికార పార్టీ తరపున నుండి అయిన ప్రతిపక్ష పార్టీ తరపున నుండి అయిన..
కానీ ఏపీలో మాత్రం స్థాయి మించి దూషణలు జరుగుతున్నాయి. ఎన్నికల సమరంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు.. మేము ఏ మాత్రం తక్కువ కాదంటూ ఇటు వైసీపీ అటు టీడీపీ వ్యక్తిగత దూషణలకు దిగారు. అప్పుడు ప్రజలు తమ విజ్ఞతతో ఎవరికి ఓటు వేయాల్నో.. ఎవరికి అధికారం కట్టబెట్టాలో తమ తీర్పును వెల్లడించారు. ఎన్నికలైనాక అయిన సరే అధికారంలో ఉన్న టీడీపీ డిజిటల్ మీడియా అయితే మరింత పెచ్చుమీరుతుంది. ఇటు వైసీపీ కూడా అదే రేంజ్ లో ఉంది.
ఇటీవల వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంపికైన ప్రముఖ యాంకర్ శ్యామల ను అయితే అధికార పార్టీ సానుభూతి పరులు.. అభిమానులు.. నెటిజన్లు అయితే ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ అయితే మాములుగా లేవు.. వినడానికి.. చదవడానికి వినసొంపుగా లేవు.. శ్యామల ఎప్పుడో చేసుకున్న రీల్స్ ను రీపోస్టు చేస్తూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వ్యక్తిగత దూషణలనే కాదు క్యారెక్టర్ ను కూడా కించపరిచేలా ట్రోల్స్ చేస్తున్నారు అని .. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు హోం మంత్రిని కోరుతున్నారు.
మరోవైపు అధికార టీడీపీ శ్రేణులు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ శ్రేణులు మాపై చేయలేదా.. అప్పుడు వాళ్లు చేసింది రైట్ అయితే మేము చేసింది రైటే .. మేమేమి పసలేని నిజాల్లేని ఆరోపణలు కాదు కదా చేసేది అని వారు సమర్ధించుకుంటున్నారు. అయితే డిజిటల్ మీడియాలో ఓ స్థాయి వరకు ఆరోపణలైన .. ట్రోల్స్ అయిన చేస్కోవచ్చు కానీ శృతి మించితేనే సమస్య ఎదురవుతుంది. ఇప్పటికైన హోం శాఖ మంత్రి మహిళలపై జరుగుతున్న ఇలాంటి ట్రోల్స్ దాడిని అరికట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.