హోం మంత్రి పోస్టుకే గురిపెట్టిన జనసేనాని..?
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన్ భారీ బహిరంగసభలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎక్కువగా మహిళలపై.. ఆడపిల్లలపై అఘాత్యాలు ఎక్కువయ్యాయి. హత్యాచారాలు మరి దారుణంగా పెరిగాయి.
గత ప్రభుత్వంలో ఉన్నట్లే పోలీసు అధికార యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంది. అప్పట్లో నన్ను అరెస్ట్ చేయడానికి ఉత్సాహాం చూపించినవాళ్ళే నేడు నేరస్తులను.. దొంగలను పట్టుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. మీ తీరు వల్ల ప్రజలు .. ప్రతిపక్షాలు మమ్మల్ని తిడుతున్నారు. హోం మంత్రిగా అనిత బాధ్యత వహించాలి. నేను హోం శాఖ తీసుకోలేక కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ను అడగలేక కాదు. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యానాథ్ లెక్క ఉండాలి. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం విచ్చిన్నమవుతుందని కలలు కంటున్నారు. కొంతమంది కోసం కూటమి ప్రభుత్వాన్ని విచ్చిన్నం చేసుకోమని అన్నారు. పవన్ వ్యాఖ్యల వెనక పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను త్వరలోనే హోం శాఖను తీసుకునే అవకాశం ఉందని పరోక్షంగా సాంకేతాలు ఇస్తున్నారు.. అందులో భాగంగానే సనాతన ధర్మం అంటూ భుజాలపై వేసుకున్నారు..