ధోనీ పై ఇర్ఫాన్ పఠాన్ సంచలన ఆరోపణలు

Irfan Pathan
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ , లెజండ్రీ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ పై సీనియర్ మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ గతంలో చేసిన సంచలన ఆరోపణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో గతంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ” తన కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు.
2008లో ఆసీస్ జట్టుతో జరిగిన సిరీస్ లో నేను బాగానే బౌలింగ్ చేశాను. అద్భుత ప్రదర్శనను కనబరిచాను. అయినా కానీ నా ప్రదర్శన బాగోలేదు. బౌలింగ్ బాగా వేయలేదని కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విషయంపై అడిగితే అంతా బాగానే ఉందని చెప్పారు. అయినా వేరేవాళ్ల గదిలో నాకు హుక్కా ఏర్పాటు చేసే అలవాటు లేదని. అందుకే నాకు తర్వాత అవకాశాలు రాలేదని ఆర్ధమయ్యేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.