అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలు
“దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యే క వాహనాలు ప్రారం భించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.. నిన్న సోమవారం నెక్లెస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించారు..
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యు త్ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు 1912 నంబరుకు ఫోన్ చేస్తే వెం టనే అత్యవసర సేవల సిబ్బంది ఈ వాహనాల్లో వస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో 57 సబ్ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్కు ఒక వాహనాన్ని కేటాయించాము.
అంబులెన్సులో ఒక అసిస్టెంట్ ఇంజినీరు, ముగ్గురు లైన్మెన్లు అవసరమైన మరమ్మతు పరికరాలతో 24 గంటలూ సిద్ధంగా ఉంటారు. ట్రాన్స్ఫార్మ ర్ను కూడా ఈ వాహనం లో తీసుకెళ్లగలరు” అని
భట్టి పేర్కొన్నా రు.