మహిళా మంత్రికి అవమానం..?

సింగిడి న్యూస్ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రిగా అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దుద్ధిళ్ల శ్రీధర్ బాబులు సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీ యొక్క ప్రధాన కర్తవ్యం అటవీ ప్రాంతం.. వన్య ప్రాణుల గురించి.. ఆభూముల గురించి ఆయా సంఘాలతో ప్రజలతో చర్చించి సేకరించిన వాళ్ల అభిప్రాయల ఆధారంగా ఓ నివేదికను తయారు చేయడం.
అయితే జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే లేపిన ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సంబంధిత మంత్రి కొండా సురేఖ కానీ సంబంధితాధికారులు లేకుండా కమిటీని ఎలా వేస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. ముందు నుండి సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు. కావాలనే అవమానించడానికి మంత్రి కొండా సురేఖకు చోటు కల్పించలేదు అని ఇటు మంత్రి అభిమానులు, కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి తీరుపై మండిపడుతున్నారు.
