స్పీకర్ పై అనుచిత పోస్టులు -వ్యక్తి అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఓ వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.. వికారాబాద్ కు చెందిన విజయ్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడిన ఆడియో వీడియో క్లిప్ ను కట్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేశారు..
దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ సీసీఎస్ లో విజయ్ పై ఆధారాలతో పిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి నిన్న శనివారం విజయ్ ను అరెస్ట్ చేశారు..
ఒకరి మనోభావాలు దెబ్బతినకుండా సోషల్ మీడియా వాడాలి.. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లపై నిత్యం నిఘా ఉంటుందని జాగ్రత్తగా వాడాలని పోలీసులు సూచిస్తున్నారు…