నేను భయపడే రకం….!

రష్మీకా మందన్నా ఇటు అభినయంతో.. అటు చక్కని అందంతో కుర్రకారుతో పాటు సినీ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి. పుష్ప, పుష్ప -2 మూవీలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈ బ్యూటీ ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థామా మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో పాత్ర గురించి పలువురు పలురకాలుగా ఊహించుకుంటున్నారు. అనేక కథనాలను ప్రచురిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి రష్మీకా మందన్నా వివరిస్తూ ఇటీవల రాత్రిపూట చిత్రీకరణ జరుపుకున్నాము.
నా మొత్తం సినిమా కేరీర్ లోనే ఇలాంటి పాత్రల్లో నటించలేదు. ఇందులో నేను దెయ్యాన్ని అంటూ అందరూ అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన కథనాలు ఎన్నో వచ్చాయి. కానీ నేను భయపడేదాన్ని కానీ భయపెట్టే దాన్ని కాదని అమ్మడు తన పాత్ర గురించి కుండలు బద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పింది .
