కాంగ్రెస్ పాలనలో ఆగని జర్నలిస్టుల అక్రమ అరెస్టులు

గతంలో పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్న పోలీసుల గుట్టును బయటపెట్టిన పెద్ద వంగర మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండ సతీష్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సతీష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల గుట్టు రట్టు చేసినందుకే పగబట్టారు. అంతేకాకుండా ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నoదుకే ఇలా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు.. ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులు, ప్రజలు ఏకం అయ్యి ఇలాంటి అక్రమ కేసులపై ఎదురు తిరగాలి..
అక్రమంగా అరెస్టు చేసిన సతీష్ ని వెంటనే విడుదల చేయాలి.. అక్రమ కేసులు ఎత్తి వేయాలని ఈ సందర్బంగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు…