వైఎస్సార్ బతికి ఉన్న రాష్ట్రం విడిపోయేది- మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!

 వైఎస్సార్ బతికి ఉన్న రాష్ట్రం విడిపోయేది- మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “రాజశేఖర్ రెడ్డి బతికున్నా తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదు!.. 2014 కాదు తెలంగాణ 2009 లోనే రావాల్సి ఉండేది ..రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు…

కానీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు అనే తీర్మానాన్ని నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం పెట్టించాలని చూసిందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విషయాన్ని వెల్లడించారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన 2009లోనే జరగాల్సిందని చెప్పారు. తాను చీఫ్ విప్ గా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి పిలిచి… ‘మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం’ అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పారని తెలిపారు.

ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని ఆయనతో తాను చెప్పానని… ‘నా చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు’ అని ఆయన తనతో అన్నారని చెప్పారు. దీంతో తాము ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడామని… ‘మేము తెలంగాణకు అనుకూలం’ అనే తీర్మానాన్ని ‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని మార్చి పెట్టామని వెల్లడించారు.  రాష్ట్ర విభజన జరగదనే తాము అనుకున్నామని… దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ ఉన్నా విభజన ఆగేది కాదని ఆయన చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *