తీరు మారకపోతే జనసేనానికి తిప్పలు తప్పవా..?

పవన్ కళ్యాణ్ అంటే మాటలకు.. చేతలకు అసలు సంబంధం ఉండదని నిన్న మొన్నటి వరకు అందరూ అనుకునేవాళ్లు.. ఎప్పుడైతే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో..లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందర్నీ గెలిపించుకున్నాడో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఓ బ్రాండ్.. ఆయనో సునామీ.. ఆయనకు తిరుగులేదు.. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించిన అపరచాణిక్యుడు అని పొగడ్తలు పవన్ పై పూల వానలెక్క పడ్డాయి.. పడుతున్నాయి..
తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే కాకుండా గతంలో వరదల సమయంలో ఎందుకు విజయవాడ వరద బాధితులను పరామర్శించలేదు అని అడిగితే బాధితులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మళ్లీ రోజు గడవకముందే పిఠాపురం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి నవ్వులపాలవ్వడమే కాకుండా రాజకీయ విమర్శకుల నుండి విమర్శలను సైతం ఎదుర్కోన్నాడు.. జనసేనాని చేసింది మంచి పనే అయిన కానీ ఇదే పని విజయవాడ వరద బాధితుల విషయంలో ఎందుకు చేయలేదు అని అప్పట్లో తెగ విమర్శలు వచ్చాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ వివాదం గురించి మాట్లాడుతూ ” లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం అన్యాయం.. భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. ఇలాంటి చర్యలకు గత వైసీపీ ప్రభుత్వం పాల్పడం హేయమైన చర్య అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ” లడ్డూ వివాదం ఎక్కడైతే జరిగిందో ఆ రాష్ట్రానికి నువ్వు ఉప ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి తర్వాత మోస్ట్ పవర్ ఫుల్ వ్యక్తివి నువ్వు.. నిజనిజాలు తేలకుండా ఇలా ఎలా అసత్య ప్రచారం చేస్తారు. మీకు నిజంగా అలా అన్పిస్తే వెంటనే సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించి నిజనిర్ధారణను చేయాలి.. అప్పుడు కదా మీరు తిరుపతి లడ్డూలో కొవ్వు కల్సిందని చెప్పాల్సింది.
ముందే ఇలా చెప్పి దేశంలో ఎలాగు మీ స్నేహితులు బీజేపీ మిత్రులు మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారు. తాజాగా మీ వ్యాఖ్యలతో ఏపీలో కూడా మత చిచ్చు రేపుతారా అని ప్రశ్నించారా..?ఇప్పటికే కుల రాజకీయాలతో ఆగమాగవుతున్న రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టిస్తారా..?. బాధ్యాతయుతమైన పదవిలో ఉన్నప్పుడు అచూతూచి మాట్లాడాలి.. మాట్లాడే మాటలకు విలువ ఉండాలి.. మీరు గతంలో మాట్లాడే మాటలకు చేసే చేతలకు పొంతన లేదు అని అనేవారు. ఇప్పుడు కూడా అలా ఉండకండి.. అధికారంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు.. చేసే చేష్టలు మనం ఎన్నాళ్లు అధికారంలో ఉంటాము.. మళ్లీ అధికారంలోకి వస్తామా రామా అని తేలుస్తాయి. అందుకే మీరు తీరు మార్చుకోకపోతే తిప్పలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు ప్రకాష్ రాజ్.
