రైతు బీమాకు రేవంత్ రెడ్డి రాం రాం..

కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతుభీమా పథకం దురదృష్టవశాత్తూ మరణించిన రైతుల కుటుంబాలకు అండగా నిలిచింది.ఎలా మరణించిన 5 లక్షలు రైతు కుటుంబానికి అందేలా ఎల్ ఐసీ ప్రీమియం చేసారు కేసీఆర్ ప్రభుత్వం..అయితే రేవంత్ రెడ్డి సర్కారు రైతుభీమా కార్యక్రమానికి మంగళం పాడనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి.
ఇంతవరకు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించలేదు రేవంత్ రెడ్డి సర్కార్,రూ.750 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే 476 మంది రైతులు మరణించారు, మరణించిన రైతులకు రైతు బీమా కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.రాష్ట్రంలో దాదాపు 3 వేల రైతు కుటుంబాలకు రైతు బీమా పరిహారం అందలేదని బీఆర్ఎస్ చెబుతుంది.ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దు అని కేసీఆర్ ప్రభుత్వం రూ.5 లక్షల రైతు బీమా పరిహార పథకాన్ని ప్రవేశపెట్టింది.
40 లక్షల రైతులకు ప్రతీ సంవత్సరం ఆగస్టు నెలలో రూ.1,450 కోట్ల ప్రీమియం చెల్లించేది..రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సుమారు రూ.750 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టినట్టు సమాచారం..సకాలంలో ప్రీమియం చెల్లించనందు వలన రైతు బీమా మంజూరు ఆలస్యం అవుతుందట, దాదాపు 3 వేలకు పైగా కుటుంబాలకు రైతు బీమా పరిహారం దక్కలేదని తెలుస్తుంది.ఒక వైపు కాంగ్రెస్ తెచ్చిన కరువుతో జనాలు గోస పడుతుంటే కనీసం వారు చనిపోయాక రైతు బీమా కూడా ఇవ్వట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
