తెలంగాణలో గురుకులాలను ఎత్తేస్తారా..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.
అయితే తాజాగా రవీంద్ర భారతి లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను.. ప్రధాన మంత్రి నరేందర్ మోడీ… రేపు ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చాము. రాష్ట్రంలో ఉన్న సర్కారు బడులను బాగు చేస్తాము.
జయశంకర్ బడి బాట పేరుతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతాము అని వ్యాఖ్యనించారు. అయితే అయ్యా గ్రామాల్లో ఉన్న సర్కారు బడులను అభివృద్ధి చేస్తే గురుకులాల్లో చేరే వారి సంఖ్య తగ్గుతుంది. దీంతో కెసిఆర్ సర్కారు ఏర్పాటు చేసిన గురుకులాలు మూత పడతాయంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు.