మెగా ఫ్యాన్స్ కు హైపర్ ఆది సలహా
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో కొందరు కావాలనే
ట్రోలింగ్ చేస్తున్నారని కమెడియన్ హైపర్ ఆది తెలిపారు. ‘ఆయనొక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయనను అందరూ గౌరవించాలి. పవన్ కళ్యాణ్ కు , మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ అల్లు అర్జున్ పై నెగటివ్ ఫీలింగ్ ఉండదు.
వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి ఆయనను ట్రోల్ చేయడం, తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టడం ఇకనైనా ఆపాలని కోరుతున్నా’ అని ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆది అన్నారు.