బీఆర్ఎస్ హయాంలో వందల ఎకరాలు కబ్జా.!

సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రెవిన్యూ కార్యాలయాల్లో ఓ ఎమ్మెల్యే చెప్పిన పని కావడం లేదు. అటెండర్ నుండి ఐఏఎస్ వరకూ ఎవరూ మాట వినడం లేదు.
చెప్పిన పని చేయడం లేదు. గతంలో పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో సీలింగ్ భూములను పట్టా చేసుకున్నారు. కొన్ని వేల ఎకరాలను కబ్జా చేశారు.
ఇది ఒక్క నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు చాలా నియోజకవర్గాల్లోఇదే జరిగింది.వాటిపై ఎంక్వయిరీ జరిపించాలి.ఎంక్వయిరీ చేస్తే అక్రమార్కులు ఎవరో బయటపడతారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
