గుజరాత్ భారీ స్కోర్…!

ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరును సాధించింది.
పూర్తి ఓవర్లను ఆడి ఆరు వికెట్లను కోల్పోయి 217 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లల్లో సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించాడు.
మరోవైపు బట్లర్ (36), షారుఖ్ (36)పరుగులతో పర్వాదలేదన్పించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లల్లో తీక్షణ , తుషార్ దేశ్ పాండే చెరో రెండు వికెట్లను పడగొట్టారు.
ఆర్చర్ ,సందీప్ శర్మ చెరో వికెట్ ను తీశరౌ. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు గెలవాలంటే ఇరవై ఓవర్లల్లో 218 పరుగులు చేయాలి.
