గణేషుడి రూపాలు ఎన్ని..?
విఘ్నేశ్వరుడు మొత్తం ముప్పై రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిలో పదహారు ప్రధాన రూపాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అవి ఏంటంటే..?. బాలగణపతి,తరుణ గణపతి,భక్త గణపతి,వీర గణపతి,శక్తి గణపతి,ద్విజ గణపతి,సిద్ధి గణపతి,ఉచ్చిష్ట గణపతి,విష్ణుగణపతి, క్షిప్త గణపతి,హేరంభ గణపతి, లక్ష్మీ గణపతి,మహాగణపతి, విజయ గణపతి, రుత్య గణపతి,ఊర్ధ్వ గణపతి లను ప్రాధాన్యతగా చూస్తారు.
గణపతుడికి పేరుకో ఆర్ధం ఉంది.. లంబోధరుడుకి అనేక పేర్లున్నాయి.. ప్రతి పేరుకు ఓ ఆర్ధం ఉంటుంది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలను తొలగించేవాడు. అటంకాలను తొలగించేవాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలవాడు అని ఆర్ధం . లంబోదరుడు అని కూడా పలుకుతారు. విజయం సాధించడానికి గౌరవం పొందడానికి రూపంతో ,అకారంతో సంబంధం లేదనే విషయాన్ని ఈ పేర్లు సూచిస్తాయి.
అవనీషుడు అంటే ఈ ప్రపంచాన్ని ఏలేవాడని ఆర్ధం.. సోదరుడు కుమారస్వామితో పోటీ పడాల్సి వచ్చినప్పుడు వాహన సదుపాయం గాని పోటీ పడే సామర్ధ్యం గానీ లేనప్పుడు తనయుక్తితో గెలుపును పొందగలిగాడు. వినాయకుడు అన్ని నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు.