సునీత విలియమ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే..!

Sunita Williams Health Condition
దాదాపు 285రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా ఈరోజు తెల్లారుజామున భూమీద ల్యాండ్ అయ్యారు. కేవలం ఎనిమిది రోజుల కోసమే అక్కడకెళ్ళిన సునీత అనుకోని పరిస్థితులు ఏర్పడటంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
అయినా కానీ మొక్కవొని ధైర్యంతో ఆమె అక్కడున్నారు. ఐఎస్ఎస్ లో రోజూ తన విధులను తాను నిర్వర్తిస్తూనే ఉన్నారు.
అనేక సవాళ్ళు ఎదురైన .. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేసిన తట్టుకోని మరి ఆమె నిలబడ్డారు. తాజాగా క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్ పై బయటకు వచ్చాక తన చేటులు ఊపుతూ నవ్వారు. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడే నలబై ఐదు రోజులు ఉండనున్నారు.
