హైదరాబాద్ లో చైనా వైరస్..!
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్ HMPV ఉనికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 2001లోనే కనుగొన్నారు.. శ్వాసకోస వ్యవస్థపై HMPV వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుంది..
ఈ వైరస్ ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నాము.. HMPV వైరస్‌పై భయం అవసరం లేదు..
అప్రమత్తంగా ఉంటే చాలు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు..