హిండెన్ బర్గ్ ఎఫెక్ట్ – రూ.53000కోట్ల సంపద ఆవిరి

3 total views , 1 views today
హిండెన్ బర్గ్ ఎఫెక్ట్ వల్ల గౌతమ్ అదానీకు చెందిన సుమారు యాబై మూడు వేల కోట్ల సంపద ఒక్కరోజే ఆవిరి అయింది. గౌతమ్ అదానీ ,సెబీ చైర్ పర్శన్ మాధబీ పై హిండెన్ బర్గ్ ఆరోపణల ప్రభావంతో మార్కెట్లపై కన్పిస్తోంది.
దీంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గౌతమ్ అదానీ కు సంబంధించిన స్టాక్స్ ఏడు శాతానికి పైగా నష్టపోవడంతో ఒక్కసారిగా యాబై మూడు వేల కోట్ల సంపద ఆవిరైంది అని స్టాక్ నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా బీఎస్ఈలో అదానీ గ్రీన్ ఎనర్జీ ధర రూ.1656కు పడిపోయింది. మరోవైపు అదానీ పవర్ 4%,విల్ మర్ ,ఎనర్జీ సొల్యూషన్ ,ఎంటర్ ఫ్రైజెస్ 3% చొప్పున నష్టాలను చవిచూసింది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్ 2% డౌన్ ఫాల్ అయింది.