హీరో వరుణ్ తేజ్ రూ.15లక్షలు విరాళం
Varun Tej Tollywood Actor
![]()
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. ఏపీలోని విజయవాడతో సహా తెలంగాణలో ఖమ్మం తదితర ప్రాంతాలు భారీ వర్షాలు.. వరదలతో తీవ్ర నష్టం చేకూరింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ముందుకోచ్చి తమవంతు సాయం ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు. రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు.. పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు,ప్రభాస్ రెండు కోట్లు,మహేష్ బాబు కోటి రూపాయలు,అల్లు అర్జున్ కోటి రూపాయలు ,హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షలు ఇలా పలువురు ముందుకోచ్చి తమవంతు విరాళాలను ప్రకటించారు.
తాజాగా మరో మెగా హీరో వరుణ్ తేజ్ పదిహేను లక్షలను వరదబాధితులకు ఆర్థికసాయం ప్రకటించారు. ఇందులో ఏపీకి ఐదు లక్షలు. తెలంగాణకు ఐదు లక్షలు ఇవ్వనున్నారు. మరో ఐదు లక్షలు ఏపీ పంచాయితీలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో తెలిపారు.