పరగడుపున ఇవి తినొద్దా..?

Healthy Food Habits
మనం ప్రతిరోజూ ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజు మనకు పునాది లాంటిది. చక్కని పోషకాలతో కూడిన ఆహారం తింటే రోజంతా యాక్టివ్గా ఉంటాం. అయితే పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు. వీటి వల్ల కొన్ని ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి పదార్థాలు ఏవో చూద్దాం.
▪ బ్రష్ చేసిన తర్వాత చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. అయితే ఇది పొట్టలో ఎసిడిటీని పెంచుతుంది. కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఏదైనా తిన్న కొద్దిసేపటి తర్వాతే టీ/కాఫీ తాగడం అన్ని విధాలా మంచిది.
▪ ఉదయాన్నే షుగర్ కలిపిన పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగడం లేదా స్వీట్లు తినడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది పొత్తికడుపు నొప్పి, కడుపులో అదనపు గ్యాస్కు కారణం అవుతుంది.
” నిమ్మ, నారింజ, బత్తాయి, ద్రాక్ష మొదలైన పండ్లను సిట్రస్ ఫలాలు అంటారు. వీటిని పరగడుపున తినకూడదు. దీని వల్ల కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి.. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
” పరగడుపున ఎక్కువ కారం, మసాలాలతో కూడిన ఫుడ్ తినకూడదు. దీని వల్ల కడుపులో మంటగా అనిపించడంతో పాటు ఇతర జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కాలేయం, మూత్రపిండాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.
