ఇవి మధుమేహం రోగులకు మేలు చేస్తాయా..?

Health Tips
ఇవి మధుమేహం రోగులకు మేలు చేస్తాయ్
మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మందులు వాడేవారు డాక్టరు సూచించిన ఆహారాన్ని తీసుకోవడం మేలు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులకు కొన్ని రకాల కూరగాయలు మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
- కాకరకాయలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మొదలైనవి ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఇవి బ్లడ్ షుగర్ను నియంత్రణలో ఉంచుతాయి.
- క్యారెట్లలో విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి. అందుకే క్యారెట్ను డయాబెటిస్ రోగులు ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
- పాలకూరలో ఐరన్, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
- బీట్రూట్లోని అనేక పోషకాలు మధుమేహం రోగులకు మేలు చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి.
