చెప్పాడు.. వస్తాడు అంతే పవన్ కళ్యాణ్…!

Trolling on Deputy CM – Cases registered..!
దాదాపు నాలుగేండ్ల కిందట శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో పెర్మార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ లో రానాతో.. బ్రో చిత్రంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పీకే అభిమానులు వకీల్ సాబ్ లెక్క సింగల్ స్క్రీన్ ఫెర్మార్నెన్స్ కోసం ఎదురు చూస్తోన్న తరుణంలో ప్రస్తుతం రెండు చిత్రాలు సిద్ధమవుతున్నాయి.
వీటిలో ఒకటి ‘హరిహర వీరమల్లు’ .. రెండోది ‘ఓజీ’. రెండు చిత్రాల చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అయితే.. వాటిలో ముందు ‘హరిహర వీరమల్లు’ ను మార్చి 28న విడుదల చేయనున్నట్టు ముహూర్తం కూడా ప్రకటించారు. అయితే.. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ విడుదల ఆలస్యం కానున్నదంటూ కొన్ని వార్తలు మీడియా వర్గాల్లో హల్చల్ చేశాయి. దీనిపై నిర్మాత ఏఎం రత్నం స్పందించారు.
“హరిహర వీరమల్లు’ను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకే విడుదల చేస్తాం. ఈ సినిమాకు సంబం ధించిన మెజారిటీ వర్క్ పూర్తయింది. బ్యాలన్స్ వర్క్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేస్తాం.’ అని తెలిపారు ఏఎం రత్నం. ఈ సినిమాలోని రెండో పాట ఈ నెల 24న విడుదల కానున్నది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.
