HCU వివాదం – కాంగ్రెస్ కు బండ్ల గణేష్ కౌంటర్..!

 HCU వివాదం – కాంగ్రెస్ కు బండ్ల గణేష్ కౌంటర్..!

Loading

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు గత వారం రోజులుగా అనేక పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరికి మద్ధతుగా పలు రాజకీయ పార్టీలు నిలిచాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రేణూ దేశాయి, నాగ్ అశ్విన్ తదితరులు లాంటి వాళ్ళు సైతం వారికి అండగా నిలిచారు.

ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుకూల ట్విట్టర్ హ్యాండిల్ ఆపాన్నహస్తం ఐడీ నుండి సెలబ్రేటీలను ట్రోల్ చేస్తూ ఓ ట్వీట్ ను ఎక్స్ లో పోస్టు చేశారు. ఆపోస్టులో పుష్ప -2 సంఘటన జరిగినప్పుడు అలా స్పందించారు. ఇప్పుడు హెచ్ సీయూ ఘటనలో ఇలా స్పందిస్తున్నారు . హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మిడి మిడి జ్ఞానంతో సెలబ్రేటీలు స్పందిస్తున్నారు అని ఓ వీడియో పోస్టు చేశారు.

దీనికి కౌంటర్ గా ఆ పార్టీ నేత. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కౌంటరిచ్చారు. ఆ ఐడీలోని పోస్టును రీట్వీట్ చేస్తూ పార్టీకోసం నిజాయితీగా పని చేసేవాళ్లను పక్కన పెట్టారు. అహర్నిశలు నిజాయితిగా పని చేసేవాళ్లను దూరం పెట్టి ఇలా మిడి మిడి జ్ఞానం ఉన్నవాళ్లను పార్టీకోసం పని చేయించుకుంటున్నారా అని కౌంటరిచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *