తెలంగాణలో బాలికపై అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ తీవ్ర అగ్రహాం

Bandaru Dattatreya Governor of Haryana
తెలంగాణ రాష్ట్రంలో గత శుక్రవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో 5 వ తరగతి చదివుతున్న మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు.. దీంతో ఆయన సిద్ధిపేట జిల్లా పోలీస్ కమీషనర్ అనురాధ గారితో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాల్సింది.. అలాగే బాలికకు కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఘటన పై పారదర్శకంగా విచారణ జరిపి నిందితుడు షెరీఫుద్దీన్ ని కఠినంగా శిక్షించాలని బండారు దత్తాత్రేయ కోరారు.
పోలీస్ కమీషనర్ గారు సానుకూలంగా స్పందించి బాలిక ఉన్నత చదువులకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ కి హామీ ఇవ్వడం జరిగింది.
