హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Haryana Assembly Election Schedule
![]()
హరియాణా (హర్యానా)లో ఒకే దశలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన సీఈసీ కమీషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ హరియాణా,జమ్ముకశ్మీర్,మహరాష్ట్ర,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.
హరియాణాలో ఉన్న మొత్తం 90స్థానాలకు అక్టోబర్ ఒకటో తారీఖున ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే నెల 4వ తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నది. దీనికి సంబంధించి వచ్చే సెప్టెంబర్ నెల 5 తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.