వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

 వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

pawan kalyan

Loading

వన్యప్రాణులను వేటాడటం… చంపడం… అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కు ఉంద’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు.

నిన్న సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను విడుదల చేశారు. వన్య ప్రాణుల వేట, అక్రమ రవాణా సమాచారం ఉంటే యాంటీ పోచింగ్ సెల్ కు తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేదం. ఎవరైనా వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదన నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వంతోపాటు బాధ్యత గల ప్రభుత్వం. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు విధులకు కట్టుబడి ఉన్నారు. చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల చిరుత పులిని చంపిన నిందితులను మూడు రోజుల్లో పట్టుకొని రిమాండ్ కు తరలించారు. అలాగే పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు.

మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, చంపినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురండి. 18004255909 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించండి. అలాగే అటవీ సంపదను నాశనం చేసినా, అక్రమ మైనింగ్ కు పాల్పడిన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాల”న్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *