హారీష్ రావును వెంటనే విడుదల చేయాలి
కాంగ్రెస్ పాలనలో పోలీసుల తీరు ఉల్టా చొర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉంది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గం. శాసనసభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పదులసంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లడం ఇంకా దుర్మార్గం.
పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలను అరెస్ట్ చేయడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణలో పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోంది. పాలన పక్కన పెట్టి.. ప్రతిపక్షాన్ని జైలుకు పంపాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించడం మానుకోవాలి.
ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు గారిపై దుర్భాషలాడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అరెస్ట్ చేసిన మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి అని వై సతీష్ రెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డిమాండ్ చేశారు..