గులాబీ పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలి..!

 గులాబీ పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలి..!

Loading

సింగిడి న్యూస్ – సిద్ధిపేట

ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి .. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి  సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ.. బిఆర్ఎస్ జెండా.. 

నాడు 2001 లో సిద్దిపేట కొనాయ్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం.. సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకోని గులాబీ జెండా ఎగరేసిండు కెసిఆర్ .సిద్దిపేట వాళ్ళు లేని బహిరంగ సభ లేదు.. ఎక్కడ సభ అయినా.. ఎక్కడ ఎన్నికలు అయిన ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పని చేసారు. రేవంత్ రెడ్డి పాలన పెయిల్ అయింది.. హైడ్రా పేరుతొ పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు, భూముల అమ్మకాల పేరుతో మూగ జీవాల గోస పోసుకున్నాడు. మూగ జీవాలు రేవంత్ రెడ్డిని క్షమించవు.

రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసిండు.వానకాలం రైతుబందు ఎగొట్టిన డబ్బులు 13 వేల కోట్లు.రుణమాఫీ చేసింది 14 వేల కోట్లు అంటే రైతు బంధును ఎగొట్టి రుణ మాఫీ సగం చేసిండు.ఈగ గింతే రుణ మాఫీ అని అసెంబ్లీ లోనే చెప్పి చేతులు దులుపు కున్నాడు.ప్రభుత్వం వైఫల్యాలు ప్రజావ్యతిరేకత వరం గల్ సభ వేదికగా ఎండగట్టాలి.సిద్దిపేట నియోజక వర్గం నుండి 20 వేలకు పైన జన సమీకరణ ఉండాలి. పెద్ద ఎత్తున తరలి రావాలి.

సిద్దిపేట కీర్తిని మరో సారి చాటి చెప్పాలి.  విద్యార్థి యువత ఆధ్వర్యంలో  వెయ్యి మందితో పాదయాత్ర, 100 ట్రాక్టర్ లతో ర్యాలీ నిర్వహించాలి.27 న పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్బంగా ప్రతి పల్లెలో పట్టణంలో  గులాబీ జెండా ఎగరేయాలి అని పిలుపునిచ్చారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *