‘హరిహర వీరమల్లు’ టికెట్ల ధరల పెంపు.

Hari Hara Veera Mallu
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది.
జూలై ఇరవై మూడో తారీఖున హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ. ఆరు వందలతో అనుమతిచ్చింది. ఈ షో ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు వేయనున్నారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మల్టీప్లెక్స్ టికెట్ రేటుపై జీఎస్టీతో పాటు రెండోందల రూపాయలు, సింగిల్ థియేటర్లలో జీఎస్టీతో పాటు నూట యాబై రూపాయలు పెంచుకోవచ్చు అని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది.
మరోవైపు జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు రెండో తారీఖు వరకు మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో పాటు నూట యాబై రూపాయలు, సింగిల్ థియేటర్లలో జీఎస్టీతో పాటు నూట ఆరు రూపాయల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజుకు ఐదు షోలు వేయనున్నారు.