ఐశ్వర్య రాజేష్ కు తప్పని వేధింపులు..!

Aishwarya Rajesh
ఇటీవల సంక్రాంతి పండక్కి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
విక్టరీ వెంకటేష్ హీరోగా..మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసల వర్షం కురుస్తుంది. తెలుగు సినీ ప్రేక్షకులకు ఇంట్లో అమ్మాయిగా దగ్గరైంది. సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో అమ్మడు పలు ఇంటర్వూలు ఇస్తుంది.
ఓ ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తన తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. దీంతో కుటుంబ బాధ్యతల కోసం ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. అందులో పని చేసే అతన్ని ప్రేమించాను. తన నుండి వేధింపులు ఎదురవ్వడంతో బ్రేకప్ అయింది. ప్రేమించే సమయంలో ఎంత ఆనందంగా ఉంటుందో బ్రేకప్ అయినాక కలిగే బాధ కూడా చాలా ఉంటుందని తన ప్రేమ గాథను వివరించింది.
