లండన్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

“Green India Challenge” in London
తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు మాన్య శ్రీ. కేసీఆర్ గారి జన్మదిన (17, (ఫిబ్రవరి, 2025) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మరియు పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో అందరూ పాల్గొని “ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి” విజయవంతం చేయాలి.
లండన్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – వృక్షార్చన” పోస్టర్‌ని ఎన్నారై బీ.ఆర్.యస్ మరియు టాక్ నాయకులు ఆవిష్కరించారు.ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలంతా వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ గారికి అరుదైన పుట్టినరోజు కానుకనివ్వాలి..
మన ప్రాంతం పచ్చబడాలనే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ గారు చేస్తున్న మాహా యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ నాయకులు నవీన్ రెడ్డి, సుప్రజ, రవి రేతినేని, రవి పులుసు మరియు క్రాంతి పాల్గొన్నారు.
