‘108’ కి గుడ్ బై..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర నంబరు 108 ఇకపై పని చేయదా..?. ఎమర్జెన్సీ సేవల కోసం ఈ నంబరుకి కాల్ చేయాల్సిన పని లేదా..?. ఈ నంబరు స్థానంలో సరికొత్త నంబర్ అమల్లోకి వచ్చిందా..?.
అవును 108 స్థానంలో 112నంబర్ ను పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలకు మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటివరకు 112తో పాటు108 నంబర్ కూడా అత్యవసర సేవలకు వాడటం తెల్సిందే.
నిన్న శనివారం నుంచి 108 నంబర్ ను రద్ధు చేసి 112 ను అత్యవసర సేవల కోసం కొనసాగించాలని బంజారాహీల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్ణయించింది. ల్యాండ్ ఫోన్ తో పాటు సెల్ ఫోన్ నుంచి కూడా వెసులుబాటు ఉంటుంది.
ఈ నంబర్ కు ఎవరైనా ఫోన్ చేస్తే వారి జీపీఎస్ ఆధారంగా లోకేషన్ ను కనుకొని సమీపంలోని గస్తీ పోలీసు లేదా అంబులెన్స్ , ఫైర్ ఇంజన్ ను పంపుతారు. ఆ తర్వాత వారికి అవసరమైన సేవలను పరిస్థితులకు అనుగుణంగా అందిస్తారు.