మహిళలకు శుభవార్త

 మహిళలకు శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా అర్హులైన మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది.. ఇందులో  దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అందదని ప్రభుత్వ వర్గాలు గుసగుసలాడుతున్నాయి . కరెంట్ బిల్స్, ఆధార్ కార్డుతో లింకైన ఫోన్ నంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *