రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త
TS:- తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
నిన్న గురువారం డా.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు.
గత ఎన్నికల్లో తాము ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాము . రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి.
రేషన్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాము . రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,629 రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు