కొత్త రేషన్ కార్డులపై శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. అయన మీడియా తో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు అయన వెల్లడించారు.
ఇందులో భాగంగా త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు .
మరో 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని అయన చెప్పారు.