కరెంటు బిల్లులపై శుభవార్త
ఏపీలోని వరద బాధిత ప్రాంతాల వారీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులను రికవరీ ను వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఎలక్ట్రీషియన్ ,ప్లంబర్ అవసరం.. లబ్ధిదారుల అవసరాల రీత్యా అధిక ధరలను వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటాము.. అవసరం అనుకుంటే వారికి ఓ ప్రత్యేక ధరను ప్రభుత్వమే నిర్ణయించి వార్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతాము.
ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటే మేమే వారింటికి పంపించి ప్లంబర్,కరెంటు పనులను రిపేర్ చేయిస్తాము. వీటికి సబ్సిడీ కూడా అందజేస్తాము.. వరదలతో.. వర్షాలతో అతలాకుతలమైన ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటాము. నా శక్తిమేర అండగా ఉంటాను అని ఆయన అన్నారు.