రేషన్ కార్డు లేనివారికి శుభవార్త..?
రేషన్ కార్డు లేనివారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో వరదలు.. భారీ వర్షాల కారణంగా వరద ప్రభావానికి గురైన విజయవాడ తదితర వరద ప్రాంతాల్లో రేపటి నుండి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు.
ఈపోస్టు మిషన్ ద్వారా నిత్యావసర వస్తువులను ఇస్తామని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో పన్నెండు అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు లక్షల మందికి సరుకుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.
రేషన్ కార్డు లేని వారికి ఆధార్ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా మంత్రులు,అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అని అన్నారు.