వారికి శుభవార్త – ఇక నుండి రూ.25000
ప్రతి రోజూ నిత్యం మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలను చూస్తున్నాము.. వార్తలను వింటున్నాము. ఆ ప్రమాదాల్లో చాలా మంది కన్నుమూస్తున్నారు కూడా.. తాజాగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లోనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చేవారికి రివార్డును కేంద్రం పెంచనున్నది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే రూ ఐదు వేలను రూ. ఇరవై ఐదు వేలకు పెంచుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి అన్నారు.
గాయపడ్డ గంటలోనే చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం చాలా ఎక్కువ. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కేసులు ,తదితర భయాలతో క్షత్రగాత్రులను చాలా మంది ఆసుపత్రులకు తీసుకెళ్లడం లేదు ఈరోజుల్లో.